Monday, 9 January 2012

Movie Artist Associate's Shocks to Tollywood Top Heroines

మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ టాలీవుడ్ బ్యూటీలకు గట్టి షాక్ ఇచ్చింది. టాలీవుడ్‌లో సభ్యత్వం తీసుకోకుండా తెలుగు సినిమాల్లో ఎడాపెడా నటిస్తున్న తమన్నా, సమంతా, తాప్సీ, ఇలియానా, జెనీలియా, స్నేహలతోపాటు పలువురు తారలపై నిషేధాస్త్రం విధించాలని నిర్ణయించింది. 

గతంలో ఎన్నిసార్లు చెప్పినా ఈ తారలు తమ మాటను పట్టించుకోలేదని, లక్షలకు లక్షలు పారితోషికాలను అందుకుంటూ సభ్యత్వం తీసుకునేందుకు మాత్రం చేతులు రావడం లేదని మండిపడింది. 

"మా" అధ్యక్షుడు మురళీమోహన్ మాట్లాడుతూ... ఇటువంటి విషయాలు బయటకు వస్తే బాగోదని చాలాసార్లు చెప్పినా హీరోయిన్లు పట్టించుకోలేదనీ, అందువల్లనే ఈ నిర్ణయం తీసుకోవలసి వచ్చిందన్నారు. 

ఇప్పటి వరకు కాజల్, అనుష్కలు మాత్రమే సభ్యత్వం తీసుకున్నారని ఒక ప్రశ్నకు సమాధానంగా ఆయన తెలిపారు. ఇండస్ట్రీలో ఉంటూ సభ్యత్వం తీసుకోని వారందరికీ ఇప్పటికే నోటీసులు పంపామని వెల్లడించారు.

No comments:

Post a Comment