Monday, 16 January 2012

Balakrishna Political Entry Creates Tense in Parties

Balakrishna Political Entry Creates Tense in Parties

* బాలయ్య పోటీపై పార్టీలో చర్చ
* బైపోల్స్ గట్టెక్కేందుకే బాలకృష్ణ కామెంట్స్‌
* క్యాడర్‌ను కాపాడుకునేందుకే బరిలో బాలయ్య
* టిడిపి కంచుకోట హిందూపురం
* బాలయ్య కోసం ఎదురుచూస్తున్న నందమూరిపురం
* బాలయ్య పెనమలూరు నుంచి పోటీ చేస్తారా?
* సొంత జిల్లా నుంచి బరిలోకి?
* కలిసివచ్చే సామాజిక వర్గం 


ప్రత్యక్ష ఎన్నికల్లో దిగుతానన్న బాలకృష్ణ ఎక్కడి నుంచి పోటీ చేస్తారు? రాయలసీమ నుంచా? కోస్తాంధ్ర నుంచా? వీలైతే తెలంగాణా నుంచా? పార్టీ ఆదేశిస్తే ఎక్కడి నుంచైనా బరిలో దిగుతానన్న బాలయ్య సీటుపై పార్టీలో జోరుగా చర్చ జరుగుతోంది. దశాబ్దకాలం విపక్షానికే పరిమితమైన పార్టీని అధికారంలోకి తీసుకువచ్చేందుకు బాలకృష్ణ, చంద్రబాబు కృష్ణార్జునుల్లా కలిసి పనిచేస్తున్నారని సీనియర్లు అంటున్నారు.

వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తానని బాలకృష్ణ ప్రకటించడంపై తెలుగుదేశంలో తీవ్రస్థాయి చర్చజరుగుతోంది. రాయలసీమ, కోస్తాంధ్ర, తెలంగాణ ప్రాంతమేదైనా అభిమాన నటుడు బాలయ్యను ముఖ్యమంత్రిగా చూడాలని ఫ్యాన్స్‌ కోరుకుంటున్నారు. గత ఎన్నికల ప్రచారంలోనే ఆయన్ను కాబోయే ముఖ్యమంత్రి అంటూ ఫ్యాన్స్‌ సంబరాలు చేసుకున్నారు. అభిమానుల కోరికకు అనుగుణంగానే ఎక్కడినుంచైనా పోటీకి సై అంటున్నారు.

బాలయ్య ప్రతక్ష్య ఎన్నికల బరిలో దిగితే టిడిపిలో రెండు పవర్‌ సెంటర్లు ఏర్పడటం ఖాయమని పార్టీలో అంతర్గత చర్చసాగుతోంది. బాలకృష్ణ బరిలో దిగితే ముఖ్యమంత్రి పీఠంపై చంద్రబాబుకు కొన్ని కష్టాలు తప్పకపోవచ్చని ప్రచారముంది. ఇందుకు బయపడి బాలయ్యను దూరంగా ఉంచితే మొదటికే మోసం వస్తుంది. అయితే ముందు పార్టీ అధికారంలోకి రావడం ముఖ్యమని ఆ తర్వాత సంగతి తర్వాత చూసుకోవచ్చని ఆలోచన చంద్రబాబులో ఉందని పార్టీలో ఆఫ్‌ ది రికార్డ్‌.

అయితే చంద్రబాబుకు స్వయానా వియ్యంకుడైన బాలయ్య పోటీ రాకపోవచ్చనే వాదన కూడా వినిపిస్తోంది. బాబు, బాలయ్య కలిసి టిడిపికి పూర్వ వైభవం తీసుకురావాలనే దృడ సంకల్పంతో ఉన్నారని పార్టీ సినీయర్లలో ఒకరు వ్యాఖ్యానిస్తున్నారు. ఏదేమైనా వరుసగా రెండు సార్లు అధికారానికి దూరమైన తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు తన వియ్యంకుడు, బావమరిది బాలయ్యను తురుపుముక్కగా వాడుకోవాలని చూస్తున్నారని ప్రచారం జరుగుతోంది. . బైపోల్స్‌లో ఏ పార్టీ ఆధిక్యం కనబరిస్తే సాధారణ ఎన్నికల వరకు టానిక్‌లా పనిచేస్తోంది.

లేకపోతే క్యాడర్‌ ఇతర పార్టీలకు వలస బాటపట్టడం ఖాయం. ఈ నేపథ్యంలో బాలకృష్ణను ఉప ఎన్నికల ప్రచారంలో ముందుంచి సాధారణ ఎన్నికల వరకు పూర్తిస్థాయిలో రంగంలోకి దించి పునర్‌వైభవం పొందాలని చూస్తున్నట్లు క్యాడర్‌ అనుకుంటోంది. తెలుగుదేశం పార్టీ కంచుకోట హిందూపురం నియోజకవర్గం. పార్టీ పెట్టినప్పటి నుంచి స్వర్గస్తులయ్యేవరకు నందమూరి తారక రామారావు ఇక్కడి నుంచే విజయదుందుబి మోగించారు. హరికృష్ణ కూడా గెలుపొందారు.

నందమూరిపురంగా పిలుచుకునే హిందూపురం నుంచి బాలయ్య పోటీ చేస్తే బంఫర్‌ మెజార్టీ ఖాయమని, జిల్లా మొత్తం క్లీన్‌స్వీప్‌ చేయొచ్చని తెలుగుతమ్ముళ్లు, నందమూరి అభిమానుల ధీమా. పైగా నందమూరి కుటుంబసభ్యులు ఇక్కడి నుంచి ప్రాతినిత్యం వహిస్తే ద్వితీయ శ్రేణీ నాయకులే ఎమ్మెల్యేగా చెలామణి అయి అన్నీ చూసుకుంటారు. అసంతృప్తి మాటే రాదు. బాలకృష్ణ పోటీ చేసే మరోస్థానం కృష్ణా జిల్లా పెనమలూరు అని ప్రచారం జరుగుతోంది. నందమూరి కుటుంబం సొంత జిల్లా కృష్ణా నుంచి ఆ కుటుంబం ఇంతవరకు ప్రాతినిథ్యం వహించలేదు.

అదే బాలకృష్ణ పోటీ చేస్తే ఆలోటు తీరుతుంది. పైగా సామాజిక బలం, అభిమానుల ఓట్లు కలిసివస్తాయి. గత ఎన్నికల త్రిముఖ పోరులో కేవలం 154 ఓట్లతో గెలిచిన మంత్రి పార్థసారధిని ఓడించేందుకు బాలయ్యే సరైన అభ్యర్థి అని టిడిపి క్యాడర్‌ భావిస్తోంది. పైగా చలసాని పండు హత్య అనంతరం పెనమలూరులో పార్టీకి ఇన్‌ఛార్జ్‌ కూడా లేరు. ఏ ప్రాతిపదికన తీసుకున్నా బాలకృష్ణ ఇక్కడి నుంచి పోటీచేస్తే బంపర్‌మెజార్టీ ఖాయమని తెలుగు తమ్ముళ్లు అంటున్నారు. మొత్తానికి బాలకృష్ణ రాజకీయ అరంగేట్రంపై తెలుగుదేశంలో సీరియస్‌గా చర్చ జరుగుతోంది. ఇది ఎటువైపు దారి తీస్తుందో చూడాలి.

No comments:

Post a Comment