Showing posts with label Telugu Film News. Show all posts
Showing posts with label Telugu Film News. Show all posts

Monday, 9 January 2012

యాంకర్ సుమకి షాక్ ఇచ్చిన పోసాని

పోసాని కృష్ణ మురళి ఏది చేసినా కొంచెం వెరైటీని మిక్స్ చేసి వదులుతూంటారు. తాజాగా ఆయన ఓ టీవి ఛానెల్ వారి గేమ్ షో కు గెస్ట్ గా వెళ్లారు. అక్కడ సుమ యాంకరింగ్ చేస్తోంది. ఆమె క్యాజువల్ గా పోసానని..సార్..మీ నెస్ట్స్ సినిమాలేంటి..వాటి టైటిల్స్ చెప్పండి అంది. వెంటనే పోసాని...బొంగు స్వామి అన్నాడు. ఆ టైటిల్ విన్న సుమ షాక్ అయ్యింది. అయితే పోసాని ఆమెను...బూతులా టైటిల్ అనిపిస్తోందా అని మళ్లి అడిగారు. ఆమె చెప్పే లోపలే...మా సినిమాలో స్వామి...బొంగులుతో చేసిన ఆసనం మీద కూర్చుంటాడు...అలాగే బొంగులతో చేసిన కుటీరంలో నివసిస్తాడు. అందుకే బొంగు స్వామి అనే టైటిల్ పెట్టానని క్లారిఫికేషన్ ఇచ్చేసాడు. 


ఇక ఈ చిత్రంలో ముమైత్ ఖాన్, నమిత లీడ్ హీరోయిన్లుగా నటించనున్నట్లు తెలుస్తోంది. దొంగ బాబాల భాగోతంపై ఈ సినిమా రూపొందించనున్నారట. ఇప్పటికే తన విలక్షణమైన నటనతో ప్రేక్షకుల ఆదరణ పొందిన పోసాని...ఈ చిత్రంలో నెగెటివ్ పాత్రతో పాటు, హీరో రోల్ లో కనిపించనున్నాడట. గత సంవత్సరం పోసారి దర్శకత్వం వహించిన ‘దుశ్శాసన’ చిత్రం ప్లాపు కావడంతో ఈ సంవత్సరం ఆయన దర్శకత్వానికి దూరంగా ఉన్నట్లే కనిపిస్తోంది. అయితే నటుడిగా మాత్రం చాలా సినిమాలు చేస్తున్నారు. ఈ సంవత్సరం పోసాని టింగరోడు చిత్రంలో హీరోగా..కృష్ణం వందే జగద్గురుమ్, అనుచరుడు, మిస్ చింతామణి తదితర చిత్రాల్లో సాధారణ పాత్రల్లో నటించబోతున్నాడు.

గంటల లెక్కన వసూలు చేస్తున్న విద్యాబాలన్

"డర్టీ పిక్చర్"‌లో సిల్క్ స్మిత పాత్రను పోషించిన విద్యాబాలన్ పరిస్థితి తంతే బూరెల బుట్టలో పడ్డట్లుగా ఉంది. డర్టీ పిక్చర్‌తో ఒక్కసారిగా తన పారితోషికాన్ని కోట్లకు పెంచేసిన ఈ ముద్దుగుమ్మ ఇప్పుడు గంటల లెక్కన వసూలు చేస్తోందట. 


ఇటీవల ఓ ప్రైవేటు పార్టీకి రమ్మని అడిగితే లక్షలు పారితోషికాన్ని డిమాండ్ చేసిందట. కేవలం రెండంటే రెండు గంటలు అలా అలా నడుము ఊపినందుకు రూ. 75 లక్షలు వసూలు చేసిందట. ఈ లెక్కన చూస్తుంటే విద్యాబాలన్ పారితోషికం ఎక్కడికో వెళ్లిపోతున్నట్లు బాలీవుడ్ సినీజనం చెప్పుకుంటున్నారు.

పూరీ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్..డిటేల్స్

పూరీ జగన్నాధ్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ నటించనున్నారా...అవుననే అంటోంది ఇండస్ట్రీ. ఈ మేరకు టాక్స్ జరగాయని, పవన్ ఓ స్టోరీ లైన్ ఓకే చేసాడని చెప్తున్నారు. పూరీ కెరీర్ ప్రారంభంలో బద్రీ అనే చిత్రాన్ని పవన్ తో చేసారు. మళ్లీ అప్పటినుంచీ ఇద్దరి కాంబినేషన్ లో సినిమా రాలేదు. మళ్లీ ఇన్నాళ్లకు పవన్ ,పూరీ లను నిర్మాత డివివి దానయ్య కలుపుతూ సినిమా చేస్తున్నాడని చెప్పుకుంటున్నారు. ఇక హీరోయిన్ గా అనీల్ కపూర్ కూతురు సోనమ్ కపూర్ నటించనుందని చెప్పుకుంటున్నారు. ప్రస్తుతం పవన్ ..తన గబ్బర్ సింగ్ చిత్రం షూటింగ్ లో బిజిగా ఉన్నాడు. హరీష్ శంకర్ దర్సకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో హీరోయిన్ గా శృతిహాసన్ నటిస్తోంది. అలాగే పూరీ దర్శకత్వంలో మహేష్ హీరోగా రూపొందిన బిజినెస్ మ్యాన్ చిత్రం విడుదలకు సిద్దంగా ఉంది. సంక్రాంతి కానుకగా రిలీజ్ కానున్న ఈ చిత్రం మహేష్ అభిమానులుకు ఓ ట్రీట్ లాంటిదని చెప్తున్నారు. కొత్త తరహా డైలాగులతో,స్టైలిష్ మేకింగ్ తో ఈ చిత్రం కొత్త రికార్డులను క్రియేట్ చేస్తుందని చెప్తున్నారు. ఇక పూరీ,పవన్ కాంబినేషన్ సినిమా అంటే ఓ రేంజి ఎక్సపెక్టేషన్స్ ఉంటాయి. మరి ఈ సారి పవన్ ని ఏ విధంగా చూపెట్టబోతున్నాడో చూడాలి. త్వరలోనే ఈ మేరకు అఫీషయల్ ప్రకటన రానుందని సమాచారం.