పవన్ కళ్యాణ్ తాజా చిత్రం గబ్బర్ సింగ్ లో మున్నా బద్నామ్ పాటలో డాన్స్ చేసే నటి కోసం వేట నిర్విరామంగా సాగుతుంది. ప్రస్తుతం ఆ బంతి నయనతార కోర్టులో పడింది. ఆమె చేస్తే ప్రత్యేకమైన క్రేజ్ వస్తుందని భావిస్తున్నారు. అందుకోసం మొన్న శ్రీరామరాజ్యం పంక్షన్ కోసం హైదరాబాద్ వచ్చినప్పుడు ఆమెను పర్శనల్ గా కలిసి నిర్మాతలు,దర్శకుడు అడగటం జరిగిందని సమాచారం. అయితే ఆమె గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదని చెప్పుతున్నారు. అయితే పవన్ కూడా ఆమె ఈ పాటలో చేస్తే బావుంటుందని ఆసక్తి చూపటంతో ఆమె ఆలోచించి చెప్తానన్నట్లు ఫిల్మ్ సర్కిల్స్ వినపడుతోంది.
గబ్బర్ సింగ్ లో ఐటం సాంగ్ కోసం ప్రముఖ హీరోయిన్స్ అందరినీ సంప్రదిస్తున్నారు. మొన్న ఇలియానా, అంతకు ముందు బిపాసా ఇప్పుడు త్రిష ఆ లిస్ట్ లో చేరారు. అయితే త్రిష కూడా ఐటమ్ సాంగ్స్ చెయ్యటం ఇష్టం లేక డేట్స్ ఖాళీ లేవని తప్పించికున్నట్లు సమాచారం. ఏప్రియల్ లో షూటింగ్ జరిగే ఈ పాట కోసం దర్శకుడు హరీష్ శంకర్ రకరకాల ఆప్షన్స్ వెతుకుతున్నారు. త్వరలోనే ఎవరిని ఎంపిక చేసారనేది తెలిసే అవకాశం ఉంది. అలాగే స్టార్ హీరోయిన్ ని మాత్రమే పాటకు తీసుకోవాలని కృత నిశ్చయింతో ఉన్నారు. వాళ్ల ఆప్షన్స్ లో శ్రియ సైతం ఉన్నట్లు తెలుస్తోంది.
No comments:
Post a Comment